డా. చిటికెన కిరణ్ కుమార్ కురాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి సన్మానం

డా. చిటికెన కిరణ్ కుమార్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి గురువారం సిరిసిల్లలో సన్మానించారు.
సాహిత్యంలో కథా, కవిత, విమర్శలలో తనదైన ముద్ర వేసిన ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసర్చ్ ఫోరం సభ్యుడు, ఓ తండ్రి తీర్పు లఘు చిత్ర కథకులు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ను ఇటీవల అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం వారు హైదరాబాద్ లో జాతీయ కవి, స్వర్గీయ డా.వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య తొలి పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి అధ్యక్షులు డా.జనపాల శంకరయ్య, ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ లు కిరణ్ కుమార్ ను సిరిసిల్లలో సన్మానించారు. సాహితీ సమితి అధ్యక్షులు డా. జానపాల శంకరయ్య మాట్లాడుతూ వంద పైచిలుకు పత్రికలలో చిటికెన రచనలు చేయడం చాలా గొప్ప విషయం అని తెలిపారు. ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ వేలాది లలిత గీతాలు రాసిన మహాకవి వడ్డేపల్లి కృష్ణ తొలి పురస్కారం చిటికెన అందుకోవడం మనకు గర్వించదగ్గ విషయమని అన్నారు. ముందు ముందు మరిన్ని పురస్కారాలు డా. చిటికెన కిరణ్ కుమార్ అందుకోవాలని ఆకాంక్షించారు. గాంధీ జయంతి పూర్వ ప్రధాని జై జవాన్ జై కిసాన్ అంటూ సైనికులకు ఊపిరినూదిన లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఘనంగా జరిగింది.
కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంధాలయ సంస్థ పూర్వ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితి సమితి సహా అధ్యక్షులు కోడం నారాయణ, సంఘ సేవకులు దొంత దేవదాస్, వ్యాపారవేత్త ఏనుగుల ఎల్లయ్య, లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.