రిజర్వేషన్లతో తారుమారైన సమీకరణలు

నిరుత్సాహంలో ఆశావాహులు
జ్ఞానతెలంగాణ,పెబ్బేర్ :
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రకటించిన రిజర్వేషన్ల ప్రక్రియతో సమీకరణాలు తారుమారు అయ్యాయి ఎన్నో రోజుల నుంచిఎదురు చూస్తున్నా ఆశావాహుల ఆశలు నీరుగారిపోయాయి. తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వస్తుందని ఆశించిన చోటమోటా నాయకులు,బడా నాయకులు ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లతో అగమ్యగోచారంతో పడిపోయారు.వివిధ పార్టీల్లో చురుకుగా పనిచేస్తున్నాం తనకే పార్టీలు టికెట్ కేటాయిస్తాయిని ఆశించిన వారికి భంగపాటు ఎదురైంది.
వారి ఆలోచనలకు విరుద్ధంగా రిజర్వేషన్ ఖరారు కావడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ రిజర్వేషన్లు తమకు అనుకూలంగా లేకపోవడంతో ఎన్నికలు ఆగిపోతే బాగుంటుందని కొందరు భావిస్తే మరికొందరు మాత్రం రిజర్వేషన్ బాగుంది ఎన్నికలు జరుగుతూనే బాగుంటుందని అనుకుంటున్నారు.పెబ్బేర్ జడ్పిటిసి స్థానం జనరల్ కు, కానీ బీసీలకు కేటాయిస్తే, కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీల నుండి,పాత నాయకులు,కొత్త నాయకులు పోటీ చేయుటకు చాలా కాలం నుండి ఆశిస్తున్నరు. కానీ పెబ్బేర్ జెడ్పిటిసి స్థానం బీసీ రిజర్వేషన్ కేటాయించడంతో నిరాశకు లోనయ్యారు.అలాగే పెబ్బేర్ పరిధి గ్రామాలలో సర్పంచ్ స్థానాలు బెడిసి కొట్టింది. సర్పంచ్ స్థానాలు కూడా ఆయా గ్రామాలలో బీసీలకు కేటాయించారు.బీసీలకు కేటాయించడంతో బీసీల ఆశావాహుల ఆశలు చిగురిస్తున్నాయి.