మొయినాబాద్ మున్సిపల్ కార్మికులకు జి ఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి

  • మొయినాబాద్ మున్సిపల్ కార్మికులకు జి ఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి
  • సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జె. రుద్రకుమార్, అల్లి దేవేందర్

ఈరోజు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు మొయినాబాద్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఆఫీస్ ముందు మున్సిపల్ కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జె.రుద్రకుమార్, అల్లి దేవేందర్ హాజరై మాట్లాడుతూ మొయినాబాద్ మున్సిపల్ ఏర్పడి దాదాపు 9 నెలలు గడుస్తున్న కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించడం లో మొయినాబాద్ మున్సిపల్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు కార్మికులకు మున్సిపల్ చట్టాల ప్రకారం వేతనాలు, యూనిఫార్మ్స్, గుర్తింపు కార్డులు తదితర బెనిఫిట్స్ అన్ని కల్పించాలని లేనిపక్షంలో విధులు బహిష్కరించి నిరవధికంగా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు మొయినాబాద్ మండల కన్వీనర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్ సిఐటియు ట్రాన్స్పోర్ట్ యూనియన్ అజీజ్ నగర్ అధ్యక్షులు డప్పు మహేందర్, సిఐటియు నాయకులు మేకల అశోక్ నాగేష్ గౌడ్ మున్సిపల్ యూనియన్ నాయకులు రత్నం సుధాకర్ సురేష్ కొమ్ము కృష్ణ జగన్ ఏసు నరసింహ వెంకటేష్ ప్రమీల కృష్ణవేణి మైసమ్మ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »