మంత్రి శ్రీధర్ బాబును బేగంపేటకు ఫ్రీజర్ ను కోరిన దాసరి శివ

జ్ఞాన తెలంగాణ,రామగిరి :
బేగంపేట గ్రామానికి ఫ్రీజర్ ను అందజేయాల్సిందిగా ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబును స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాసరి శివ కోరారు.చనిపోయిన వారి మృతదేహాలను (భౌతికకాయాన్ని) సందర్శన కోసం ఉంచడానికి బేగంపేట గ్రామంలో ఫ్రీజర్ అందుబాటులో లేని విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లగా ఫ్రీజర్ ను అందజేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు హమీ ఇచ్చినట్లు దాసరి శివ పేర్కొన్నారు.అయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు గ్రామాన్ని దోచుకుతింటూ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారనీ ప్రజల చేత ఓట్లు వేయించుకొని ప్రజల అవసరాలు తీర్చడంలో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలం చెందారని దాసరి శివ ఆవేదన వ్యక్తం చేశారు.బేగంపేట గ్రామంలోని సమస్యలకు మంత్రి శ్రీధర్ బాబు గారు పరిష్కారం చూపుతున్నారని ఇప్పటికే నూతన ఐకెపి విస్తరణ పనులు విద్యుత్ స్తంభాలు ఏర్పాట్లు పబ్లిక్ బోర్ల నిర్మాణాలు నూతన బస్ షెల్టర్ నిర్మాణం మురుగునీటి కాలువలు తవ్వకాలు ఉచిత వైద్య సదుపాయాలు ఇతర ప్రాంతాల్లో చనిపోయిన వారికి ఉచిత అంబులెన్స్ సౌకర్యాలాంటి తదితర సమస్యలకు మంత్రి శ్రీధర్ బాబు గారు పరిష్కారం చూపారని దాసరి శివ వెల్లడించారు.