జిల్లా కబడ్డీ జట్టుకు మరో అడుగు దూరంలో ప్రొద్దుటూరు విద్యార్థి

- సబ్ జూనియర్ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ లో సత్తా చాటిన నక్క హర్షిత్
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:
రంగారెడ్డి జిల్లా అండర్-16 సబ్ జూనియర్ కబడ్డీ టోర్నమెంట్ ఎంపికల్లో ప్రొద్దుటూరు యువకుడు నక్క హర్షిత్ తన ప్రతిభను చాటుకొని జిల్లా జట్టులోకి చేరే దిశలో మరో అడుగు దూరంలో ఉన్నాడు.నక్క హర్షిత్ ప్రస్తుతం ప్రొద్దుటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్‌లో నిర్వహించిన ఎంపికల్లో ప్రొద్దుటూరు నుంచి తొమ్మిది మంది యువ క్రీడాకారులు పాల్గొన్నారు.మొదటి రౌండ్‌లో పొద్దుటూరు గ్రామం నుంచి అఫ్రోజ్, విష్ణు, హర్షిత్, జాషువా అర్హత సాధించి, మూడవ రౌండ్ కు చేర లేకపోయినా వారి ఆట తీరుకు ప్రేక్షకులు, సెలెక్టర్లు ప్రశంసలు కురిపించారు, వీరిలో ప్రొద్దుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి నక్క హర్షిత్ మాత్రం రైడింగ్ లో అద్భుత ప్రతిభ కనబరచి ఫైనల్ రౌండ్‌కు అర్హత పొందాడు.హర్షిత్ ప్రదర్శనలో చూపిన ధైర్యం, చాకచక్యం, పట్టుదల ద్వారా అతను జిల్లా జట్టులో స్థానం సంపాదించడానికి మరొక అడుగు దూరంలో ఉన్నాడు. ప్రొద్దుటూరు గ్రామస్థులు, స్నేహితులు, క్రీడాభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఫైనల్ రౌండ్ లో సెలెక్ట్ అయ్యి జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు.