సెప్టెంబర్ 15న సబ్ జూనియర్ కబడ్డీ సెలక్షన్స్

సెప్టెంబర్ 15న సబ్ జూనియర్ కబడ్డీ సెలక్షన్స్
- రంగారెడ్డి జిల్లా బాలురు, బాలికలకు గొప్ప అవకాశం
- సెలెక్ట్ అయిన వారికి నిజామాబాదులో జరిగే అంతర్ జిల్లా పోటీల్లో పాల్గొనే అవకాశo
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:
రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ బాలురు, బాలికల కబడ్డీ జట్టు ఎంపికలు ఈ నెల 15న (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రకటించింది.
ఈ ఎంపికల్లో విజయాన్ని సాధించిన ఆటగాళ్లు సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లా ముప్కల్ గ్రామంలో జరగనున్న 35వ సబ్ జూనియర్ అంతర్జిల్లా కబడ్డీ పోటీల్లో రంగారెడ్డి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
అర్హతల విషయానికి వస్తే, బాలురు, బాలికల బరువు 55 కిలోల లోపు ఉండాలి. అలాగే 2009 నవంబర్ 30 తర్వాత పుట్టిన వారే పాల్గొనడానికి అర్హులు. ఎంపికల కోసం హాజరయ్యే వారు ఆధార్ కార్డు లేదా 10వ తరగతి మెమో తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది.
వివరాలకు జె చంద్రమోహన్ 7661992581, లింగం గౌడ్ 9000222489ను సంప్రదించవచ్చని తెలిపారు.
జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లాలోని అర్హులైన బాలురు, బాలికలు ఈ ఎంపికల్లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని, ఎంపికైన వారికి జిల్లా తరపున ఆడే గొప్ప అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
