కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి ఆశయాలు వర్ధిల్లాలి

జ్ఞాన తెలంగాణ రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రతినిధి :
ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి స్మారక స్థూపానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించిన సీపీ(ఐ)ఎమ్ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం హిందూ ముస్లిం మధ్య జరిగింది కాదని నిజాం సైనిక తొత్తులైనపెత్తందారులకు తెలంగాణ ప్రజలకు మధ్య జరిగిన పోరాటమని అదేవిధంగా నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నిర్మాణంలో ఒక్కరైన బద్దంఎల్లారెడ్డి ప్రజల్ని ఎంతో చైతన్యం చేసి ఎన్నో రోజులు జైలు జీవితం గడిపారని ఈ ప్రాంత ప్రజలను కాకుండా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఉద్యమాలు చేశారని అన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కోడం రమణ జవ్వాజి విమల జిల్లా కమిటీ సభ్యులు గన్నేరo నర్సయ్య సూరం పద్మ ముక్తి కాంతా అశోక్ గురుజాల శ్రీధర్ సావనపల్లి రాములు గరిగే రవి బిక్షపతి
సామ నరసింహ రెడ్డి అశోక్ సావనపల్లి ప్రభాకర్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.