మిషన్ భగీరథ నీటి సరఫరా నాలుగు రోజులపాటు నిలిపివేత

- ఉన్న నీటిని పొదుపుగా వాడండి
- ప్రజలకు నాలుగు రోజులపాటు సహనం అవసరం
- చేవెళ్ల సబ్ డివిజన్ ఈ ఈ చల్మారెడ్డి వెల్లడి
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు శంకర్ పల్లి మున్సిపాలిటీ మరియు మండలంలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేయబడుతుందని చేవెళ్ల సబ్ డివిజన్ ఇంజినీర్ చల్మారెడ్డి తెలిపారు.రంగారెడ్డి జిల్లాలోని కమ్మదనం నుంచి కడ్తాల్ వరకు గేట్వాల్స్, పైప్‌లైన్‌ల మరమ్మత్తులు జరుగుతున్నందున షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్ మరియు శంకర్ పల్లి మండలాల్లో నాలుగు రోజులపాటు నీటి సరఫరా నిలిపివేయబడుతుందని వెల్లడించారు.ఈ విషయాన్ని ప్రతి గ్రామపంచాయతీ కార్యదర్శులకు, అలాగే చేవెళ్ల, శంకర్ పల్లి, మొయినాబాద్ మున్సిపాలిటీ కమిషనర్‌లకు కూడా తెలియజేశామన్నారు.ప్రజలు ఈ నాలుగు రోజులపాటు సహకరిస్తూ, ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.