మృతుల కుటుంబాలకు ప్రసన్నరాజ్ పరామర్శ

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 11: మండల కేంద్రంలోని పద్మశాలికాలనీ చెందిన ఆకుల ఎల్లమ్మ, అంబేద్కర్ నగర్ కు చెందిన గోపగాని ముత్తయ్య అనారోగ్యంతో గురువారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్నరాజ్ పార్టీ నాయకులతో కలిసి మృతదేహాలను సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు పెద్ది బాలనర్సయ్య గౌడ్ తండ్రి వెంకటయ్య దశదిన కార్యక్రమంలో పాల్గొని ప్లెక్సీకి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన వెంట పీఏసీఎస్ మాజీ చైర్మన్ నూక సైదులు, మాజీ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, నాయకులు చెరుకు వెంకటాద్రి, గుండాల మల్లేష్, మేకల రమేష్, చింత నాగార్జున, ఊట్కూరి నాగయ్య, తండు సోమయ్య, నిమ్మనగోటి శివ, ఎలమంద, అంతటి నగేష్, చీరబోయిన నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »