ఇంద్రనగర్ దొడ్డిలో రూ, 4 లక్షల 81 వేలకు ఘనపయ్య లడ్డు కైవసం చేసుకున్న కావలి రాము

హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం


జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, సెప్టెంబర్ 07: పురపాలక పరిధిలోని ఇందిరానగర్ (దొడ్డి)లో గణపయ్య మండపం వద్ద జరిగిన వేలంపాటలో రూ, 4 లక్షల 81 వేలకు వేలం పాట లో కావలి రాము కనకయ్య లడ్డును కైవసం చేసుకోవడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో శుక్రవారం ఇంద్రానగర్ (దొడ్డి) హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఘనపయ్య నవరాత్రి పూజలో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలు కావలి రాము రూ, 4 లక్షల 81 వేలకు కైవసం చేసుకోగా, రెండవ లడ్డు రూ, 2 లక్షల 51వేలకు కైవసం చేసుకోవడం జరిగిందని హనుమాన్ యూత్ అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. గణపయ్య మండపం వద్ద వేలంపాట ఎంతో వైభవంగా జరిగిందని భక్తులు పెద్ద ఎత్తు న వేలంపాటలు పాల్గొన్నారని అన్నారు. ప్రతి ఏటా పురపాలక పరిధిలోని ఊట్ పల్లి (దొడ్డి) లో గణపయ్య నవరాత్రి ఉత్సవాలు వేలంపాట కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతాయని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఇంద్రనగర్ తోటి గ్రామానికి చెందిన పాముల రాఘవేందర్ గడ్డమీది శివకుమార్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు, వేలంపాట కార్యక్రమాలు భక్తి ప్రపత్తులతో ఎంతో ఉత్సాహంగా భక్తులందరి సహకారం గ్రామ ప్రజల సహకారంతో నిర్వహించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తింటి శ్రీకాంత్, కంచు గంట్ల ఉదయ్, చేపల నిహాల్, కుమ్మరి భాను ప్రకాష్, పురం శెట్టి రాహుల్ కు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నామని ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.

You may also like...

Translate »