అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి, కేసు నమోదు

మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి.
మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి కథనం మేరకు….కురవి మండలం తాట్యా తండకు చెందిన భూక్య రాంబాబు, S/o కిషన్, వయసు: 28 సం,,లు అనే యువకుడు కారు డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు, నిన్న అనగా తేది: 04-09-2025 ఉదయం డ్యూటీ కి వెళ్తున్నానని ఇంట్లో వాళ్ళకు చెప్పి మృతుని యొక్క పెద్ద బావ కారు తీసుకొని వెళ్ళినాడు, రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈరోజు ఉదయము గాయత్రి గుట్టదగ్గరలోని కంకరమిల్ తండ దగ్గర ఒక కారులో చనిపోయి ఉన్నాడని వారి సమీప బంధువు ఫోన్ ద్వారా మృతుని తండ్రికి తెలియపర్చగా వాళ్ళు వెంటనే వచ్చి చూడగా తన యొక్క కుమారుడు కారు లో అనుమానాస్పదంగా మరణించి ఉన్నాడని మృతుని తండ్రి భూక్య కిషన్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించామని సీఐ తెలిపరచినారు.
