లడ్డూ వేలంపాటలో వెలిగిన అన్నదమ్ముల అనుబంధం

  • పొద్దుటూరు మాజీ వార్డ్ మెంబర్ కవేలి రామ్ రెడ్డి – తమ్ముడు రాజేందర్ రెడ్డిల భక్తి ప్రతీక
  • రూ.51,000 – రూ.31,000లకు లడ్డూల కైవసం

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మండలంలోని పొద్దుటూరు గ్రామంలో గణేష్ నిమజ్జనం వేడుకలు గురువారంనాడు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంలో ఎనిమిదవ వార్డు మాజీ వార్డు సభ్యుడు కవేలి రామ్ రెడ్డి, ఆయన సోదరుడు రాజేందర్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామంలో ప్రతిష్ఠించిన రెండు వినాయకుల లడ్డూలను అత్యధిక మొత్తాలకు కైవసం చేసుకోవడం ద్వారా తమ భక్తిని చాటుకున్నారు. నాయి బ్రాహ్మణ విశ్వకర్మ వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఉన్న లడ్డూను రూ.51 వేలకు, మొదటి వార్డులోని వినాయకుడి లడ్డూను రూ.31 వేలకు కైవసం చేసుకున్నారు.

ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సహోదరులను ఘనంగా సన్మానించి దైవ ప్రసాదాన్ని అందజేశారు. లడ్డూలు కైవసం చేసుకున్న అనంతరం రామ్ రెడ్డి తన ఆధ్యాత్మిక భావనను వ్యక్తపరుస్తూ, “వినాయకుని ఆరాధన మన జీవితానికి శాంతి, శక్తిని ప్రసాదిస్తుంది. ఇది కేవలం ఒక వేలంపాట కాదు, భక్తికి ప్రతీక. గ్రామంలో ఐక్యత పెరగాలని, వినాయకుని ఆశీస్సులు ప్రతి ఇంటికీ చేరాలని కోరుకుంటున్నామని తెలిపారు.రామ్ రెడ్డి సోదరుడు, రాజేందర్ రెడ్డి మనసులోని భావాన్ని తెలియజేస్తూ, మన ఊర్లో గణేష్ ఉత్సవాలు కేవలం పండుగలు కావు, ఇవి మనసులను కలిపే ఆధ్యాత్మిక వేదికలు. వినాయకుడు విఘ్నాలను తొలగించి సత్పథంలో నడిపించే శక్తి. ఈ ఉత్సవాల ద్వారా వచ్చే ఏకతా భావం ఎప్పటికీ నిలవాలని కోరుకుంటున్నామని అన్నారు.సహోదరులిద్దరి ఈ ఆధ్యాత్మిక భావవ్యక్తీకరణ గ్రామ ప్రజల హృదయాలను స్పృశించింది. గ్రామ పెద్దలు వారిని అభినందిస్తూ, “భక్తి, సేవ, దానం సమన్వయం వీరిద్దరిలో స్పష్టంగా కనిపిస్తోంది. భక్తులకు స్ఫూర్తి నింపే వ్యక్తులు వీరే” అని ప్రశంసించారు.

లడ్డూలను కైవసం చేసుకోవడమే కాకుండా, అన్నదమ్ముల అనుబంధాన్ని, ఐక్యతను కూడా ఈ సందర్భంగా చూపించారు రామ్ రెడ్డి – రాజేందర్ రెడ్డి. ఒకరికి ఒకరు తోడుగా నిలిచి భక్తి మార్గంలో ముందుకు సాగడం గ్రామస్థులకు స్ఫూర్తినిచ్చింది. భక్తి అంటే కేవలం వ్యక్తిగత విశ్వాసం మాత్రమే కాదని, అది కుటుంబ బంధాలతో కలిసినపుడే మరింత శక్తివంతమవుతుందని వారు నిరూపించారు.గ్రామ పెద్దలు మాట్లాడుతూ, “అన్నదమ్ముల మధ్య ఇంతటి ఐక్యత, పరస్పర సహకారం కనిపించడం చాలా అరుదు. భక్తి, దానం మాత్రమే కాదు, కుటుంబ అనుబంధాలు కూడా ఎంత గౌరవప్రదంగా ఉండాలో వీరు చూపిస్తున్నారు. పొద్దుటూరులో అన్నదమ్ముల ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నామన్నారు.సహోదరులిద్దరి ఆధ్యాత్మిక భావనలు, ప్రేమపూర్వక బంధం, ఈ గణేష్ నిమజ్జనాన్ని మరింత విశిష్టంగా మార్చాయి. భక్తి, బంధం, సేవ—ఈ మూడింటినీ సమన్వయం చేస్తూ వారు గ్రామ ప్రజల మనసుల్లో చిరస్మరణీయ ముద్ర వేశారు.

You may also like...

Translate »