ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అధికారిణి..

  • కలెక్టరేట్‎లోనే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టివేత..!!

నల్లగొండ: రాష్ట్రంలో యాంటి కరప్షన్ బ్యూరో (ఏసీబీ) దూకుడు పెంచింది. వేలకు వేలు జీతాలు వస్తోన్న అడ్డదారుల్లో లంచాలు తీసుకుంటున్న అవినీతి అధికారుల భరతం పడుతున్నారు.

ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారిణి చిక్కారు. పని కోసం వచ్చిన ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.వివరాల ప్రకారం.. నల్లగొండ కలెక్టర్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు జిల్లా మత్స్య శాఖ అధికారిణి ఎం.చరిత రెడ్డి. ఫిషరీస్ కో ఆపరేటివ్ సొసైటీలో కొత్త సభ్యుల పేర్ల నమోదుకు అవకాశం కల్పించడం కోసం ఓ వ్యక్తి దగ్గర లంచం డిమాండ్ చేశారు చరిత రెడ్డి. ఈ క్రమంలో గురువారం (సెప్టెంబర్ 4) బాధితుడి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా చరిత రెడ్డిని రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపర్చి న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‎కు తరలించారు.

You may also like...

Translate »