రోడ్డు ప్రమాదంలో గాయపడిన మాజీ సర్పంచ్ రాచన్నను పరామర్శించిన స్పీకర్

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి :
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కల్కొడా గ్రామ మాజీ సర్పంచ్ రాచన్నను తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం శంకర్‌పల్లిలోని గాయత్రి ఆసుపత్రిలో పరామర్శించారు.మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన రాచన్న ప్రస్తుతం శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని హైదరాబాద్ రోడ్డులో గల గాయత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్పీకర్ ప్రత్యేకంగా ఆసుపత్రికి వెళ్లి రాచన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ అపర్ణ, డాక్టర్ వీరప్పలతో మాట్లాడి జరుగుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. రాచన్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అవసరమైతే మరింత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.స్పీకర్ వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు ఉన్నారు. రాచన్న అనుచరులు, గ్రామ ప్రజలు ఆసుపత్రి వద్ద స్పీకర్‌ను కలసి ఆయన పరామర్శకు కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...

Translate »