పోలిశెట్టిపల్లిలో సీసీ రోడ్డు వేయాలి: స్వేరోస్

బల్మూరు మండలం పోలిశెట్టిపల్లిలోని MPUPS పాఠశాలకు వెళ్లే రహదారికి సిసి రోడ్డు వేయాలని స్వేరోస్ మండల అధ్యక్షుడు బాబు వస్కుల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో కార్యాలయంలోని సూపరిండెంట్ జగదీష్ కు బుధవారం వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ.. ఆ పాఠశాలకు వెళ్లేదారి అస్తవ్యస్తంగా ఉందన్నారు. విద్యార్థుల పాఠశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లలిత కళా యువజన సంఘ భవనం నుండి పాఠశాల వరకు సిసి రోడ్డు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.