తెలంగాణ స్థానిక ఎన్నికలు సెప్టెంబర్ మూడో వారంలోనే!

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:
ఆగస్టు 29న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, కాలేశ్వరం నివేదిక ప్రధాన అంశాలుగా చర్చకు వచ్చాయి.

బీసీలకు 42% రిజర్వేషన్ :స్థానిక సంస్థలలో బీసీ వర్గాల ప్రాతినిధ్యాన్ని 42 శాతం వరకూ పెంచే నిర్ణయాన్ని ప్రభుత్వం మరోసారి ధృవీకరించింది. దీనికి అవసరమైన ప్రత్యేక ఉత్తర్వులు (GO) త్వరలోనే జారీ కానున్నాయి.

కాలేశ్వరం నివేదిక: జస్టిస్ పి.సి. ఘోషే కమిషన్ సమర్పించిన కాలేశ్వరం ప్రాజెక్ట్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. మెడిగడ్డ, అన్నరాం, సుందిల్లా బ్యారేజీలలో రూపకల్పన లోపాలు ఉన్నట్లు నివేదికలో పేర్కొనడం వల్ల, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఘర్షణాత్మక చర్చ జరిగే అవకాశం ఉంది.

స్థానిక ఎన్నికల తేదీ:హైకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు పూర్తిచేయాల్సి ఉండటంతో, ఎన్నికలు సెప్టెంబర్ 15 నుంచి 20 మధ్యలోనే జరగే అవకాశం ఉందని అధికార వర్గాలు సంకేతాలిచ్చాయి. తుది షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో ప్రకటించనుంది.మొత్తం మీద, బీసీ రిజర్వేషన్లు – కాలేశ్వరం నివేదిక – స్థానిక ఎన్నికలు, ఈ మూడు అంశాలే కేబినెట్‌లో చర్చకు కేంద్రబిందువుగా నిలిచాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కనుంది.

You may also like...

Translate »