వైద్య సంస్థల నిబంధనలపై స్టే లేదు: సుప్రీం కోర్టు

వైద్యసంస్థల నిబంధనలు-2012 ఇప్పటికీ అమలులోనే ఉన్నాయని, వాటిపై స్టే ఏమీ ఇవ్వలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నేత్ర వైద్య విధానాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఒకే రకమైన ధరలను నిర్ణయించడాన్ని సవాల్‌ చేస్తూ ఆల్‌ఇండియా ఆప్తాల్మోలాజికల్‌ సొసైటీ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశానికి సంబంధించి తాము ఎలాంటి నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వలేదని పేర్కొంది. ఆస్పత్రుల్లో ధరల పట్టికను ప్రదర్శించాలన్న నిబంధనను తప్పనిసరిగా అమలు చేసేలా ఆదేశించాలంటూ దాఖలైన మరో పిటిషన్‌పైనా ధర్మాసనం విచారణ చేపట్టింది.

You may also like...

Translate »