వినాయక మండపాల్లో డెమో క్రీడలు, సరదా ఆటలు..

  • 23 నుంచి 31 వరకు జాతీయ క్రీడా దినోత్సవాలు

రాష్ట్రంలో నిర్వహించనున్న జాతీయ క్రీడా దినోత్సవాల్లో భాగంగా వినాయక మండపాల్లో డెమో క్రీడలు, సరదా ఆటలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కాలనీ సంఘాలు, గేటెడ్‌ కమ్యూనిటీలను భాగస్వామ్యం చేయనున్నారు. ఈ ఏడాది జాతీయ క్రీడా దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి 31 వరకు ఈ ఉత్సవాలను చేపట్టాలని నిర్ణయించింది. అన్ని జిల్లాల కలెక్టర్లతోపాటు విద్యాశాఖ.. గురుకుల విద్యాసంస్థలు, క్రీడా పాఠశాలలు, అకాడమీలు, ఉద్యోగ సంఘాలు ఈ క్రీడా ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొనేలా చూడాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. ఈ మేరకు 9 రోజులపాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. భవిష్యత్తులో ఒలింపిక్‌ స్ఫూర్తిని నింపేందుకు 6 నెలల నుంచి పదేళ్లలోపు చిన్నారుల కోసం బేబీ క్రాలింగ్, రన్నింగ్‌ రేస్, జంపింగ్‌ బాల్‌ వంటి ఆటలను నిర్వహిస్తారు. పదేళ్లు దాటినవారికి 5కే రన్, 14ఏళ్లు దాటినవారికి 10కే రన్‌ చేపడతారు. ప్రతి జిల్లాలో ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తారు. వినాయక చవితి పర్వదినాన జాతీయ క్రీడా దినోత్సవం రన్‌ను చేపడతారు. ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడల నిర్వహణ.. వ్యాయమవిద్యపై అవగాహన కల్పించడం.. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలవారీగా ఆటలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు

You may also like...

Translate »