ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి

ఇండియా కూటమి కూడా కీలక నిర్ణయం తీసుకుంది.. ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇండి కూటమి ఉండనున్నట్లు ప్రకటించింది.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి పేరును ఇండియా కూటమి ప్రకటించింది.. ఈ మేరకు ఇండియా కూటమి సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి పేరును ప్రకటించారు.జాతీయ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.. ఎన్డీఏ, ఇండియా కూటమి.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం కోసం పావులు కదుపుతున్నాయి.. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ ను ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే.. ఇండియా కూటమి కూడా కీలక నిర్ణయం తీసుకుంది.. ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇండి కూటమి ఉండనున్నట్లు ప్రకటించింది.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి పేరును ఇండియా కూటమి ప్రకటించింది.. ఈ మేరకు ఇండియా కూటమి సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి పేరును ప్రకటించారు.సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి 2007 నుంచి 2011 వరకు సుప్రీం న్యాయమూర్తిగా సేవలు అందించారు. గోవాకి మొదటి లోకాయుక్తగా పనిచేశారు. జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి స్వస్థల రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం.. ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన సుదర్శన్‌రెడ్డి.. పలు కీలక బాధ్యతలను చేపట్టారు.

You may also like...

Translate »