ఉగ్రవాదులతో పోరాడే యాంటీ టెర్రరిస్ట్ వెహికల్

యాంటీ _టెర్రరిస్ట్ _వెహికల్ (ATV)

జనావాసాల్లో, ఇళ్ళ మధ్యలో, బిల్డింగ్ లోపల దాక్కుని దాడులు చేసే ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి DRDO కొత్తరకం వాహనాన్ని తయారుచేసింది.దీని బరువు సుమారు 3 టన్నులు, దీన్ని ఒకరు నడుపుతూ ఇద్దరు ఆయుధాలు ఉపయోగిస్తూ మొత్తం ముగ్గురు సైనికులు ఉపయోగించవచ్చు.ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ & హ్యాండ్ గ్రనేడ్ ప్రూఫ్ & బ్లాస్ట్ ప్రూఫ్.ఇది శబ్దం చేయని విధంగా ఎలక్ట్రికల్ వెహికిల్.ఇది 7 అంగుళాల ఎత్తున్న మెట్లు కూడా ఎక్కగలదు.ఇరుకైన సందుల్లో, ఇళ్ళ మధ్య, బిల్డింగుల కారిడార్లలో ఇది శులువుగా చొచ్చుకుపోతుంది.కావాలంటే పైనుంచి టాప్ లేపుకుని సైనికులు బయటికి దూకేయొచ్చు.దీన్ని బెల్ట్‌ట్రాక్ మరియు టైర్ రెండు వర్షన్లలోనూ డిఆర్‌డీఓ అభివృద్ధి చేసింది.ఉన్న చోటినే అక్కడే ఉండి 360 డిగ్రీలు చుట్టూ రౌండు తిరగగలదు.ఉగ్రవాదులు, పేలుడు పదార్థాలు ఏ వైపున, ఎంత దూరంలో ఉన్నాయో కనిపెట్టే సెన్సార్లు కూడా దీనిలో ఉన్నాయి…

You may also like...

Translate »