వినాయకుడి విగ్రహం తరలిస్తుండగా ప్రమాదం

కరెంట్ షాక్‌తో మరో ఇద్దరు మృతి..
హైదరాబాద్ రామంతాపూర్ విషాద ఘటన మరువకముందే నగరంలో మరో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో తాజాగా మరో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న క్రమంలో యువకులు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన కొందరు యువకులు వినాయక మండపానికి భారీ భారీ గణనాథుడి విగ్రహాన్ని ట్రాక్టర్ పై తరలిస్తుండగా.. బండ్లగూడ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.ట్రాక్టర్‌పై ఉన్న భారీ విగ్రహం హై టెన్షన్ విద్యుత్ వైర్లను తాకడంతో.. విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు యువకులు టోని (21), వికాస్ (20) అక్కడికక్కడే మరణించారు. అఖిల్ అనే మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. పోలీసులు, క్రేన్ సహాయంతో విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
