ఘనంగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశం

  • ప్రజాసేవా, ఎన్నికల విజయానికి దిశానిర్దేశం
  • ఉచిత శానిటరీ ప్యాడ్ల పంపిణీ ద్వారా బాలికల సంక్షేమం

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:
తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు అధ్యక్షతన గాంధీ భవన్‌లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఇంచార్జి కమలాక్షి రాజన్న హాజరయ్యారు. సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల మహిళా కాంగ్రెస్ నాయకులు, అలాగే రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీజ్యోతి భీమ్ భరత్ పాల్గొన్నారు.సభలో బాలికల సంక్షేమం కోసం ఉచిత శానిటరీ ప్యాడ్ల పంపిణీ చేపట్టాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించేందుకు సమగ్రంగా శ్రద్ధ చూపాలని స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. అలాగే ఆగస్టు 20న గౌరవ శ్రీ రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.సభా చర్చల్లో, కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలపై మరింత దృష్టి పెట్టి, మహిళా సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని ప్రధానంగా పలు సూచనలు చేశారు.

You may also like...

Translate »