గో బ్యాక్ మార్వాడీ ఎందుకంటే…

దోపిడీ వ్యాపారి గో బ్యాక్ వెనక పెద్ద కథే ఉంది..

వాడు వ్యాపారంతో పాటు విద్వేషాన్ని ,విద్వేషంతో కూడిన
రాజకీయాలను వెంట పెట్టుకుని పట్టణాలను ముట్టడిస్తూ పల్లెలకు వస్తున్నాడు.

అమాయకంగా నవ్వుతాడు. మనుషులను ప్రేమించడు కానీ పశువులను పోషిస్తున్నానని చెబుతాడు.

ఒక పండగ పూట నెమ్మదిగా ఒక విద్వేష జెండా తన దుకాణం పై ఎగరేస్తాడు.ఆ జెండా కు మతం ,జాతీయత, దేశభక్తి ముసుగు అద్దుతాడు.

అమాయక జనం ఆ ముసుగు చూసి జై శ్రీ అని చేతులు కలుపుతారు.. స్ధానిక మద్దతు వచ్చిందకున్నాక వాడు నకిలీ వస్తువులను దించుతాడు.. బిల్లులు లేకుండా వ్యాపారం జోరుగా సాగుతుంది..

నాలుగు డబ్బులు కూడ బెట్టాక.. కొందరికి చందాలు ఇస్తాడు.. అంతే వాడికి వెయ్యి మదపుటేనుగుల బలం వస్తుంది..
నకిలీ వస్తువులు అమ్మావని ఎవరైనా అడిగితే అడిగిన వారిపై భౌతిక దాడులు చేస్తాడు..

వాడికి మద్దతుగా చందాలు తీసుకున్న రాజకీయ గణం తోడవుతుంది.. అధికార యంత్రాంగం కదులుతుంది.. ప్రశ్నించిన వాడిని ఎలాంటి కారణం లేకుండా పోలీసులు అర్ధ రాత్రి కట్టు బట్టలతో తీసుకుపోతారు.

అంతేకాదు ప్రశ్నిస్తే వేరే మతం వాళ్లని, వేరే పార్టీ వాళ్ళని గోల చేస్తాడు… దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్టు.. బిగ్గరగా అరుస్తాడు.

పల్లెల్లో సంప్రదాయ వ్యాపారం చేసుకునే సామాన్య వ్యాపారి తన వ్యాపారం దెబ్బతిని ఏమి చేయాలో తెలియక రోడ్డున పడతాడు..

కానీ నయా వ్యాపారి దోపిడీని ప్రశ్నించే తత్వం మాత్రం వీడికి ఉండదు.. ప్రశ్నించే వారికి అండనిచ్చే ధైర్యం కూడా ఉండదు.. వీళ్లలో కొందరు మతం ముసుగుతో తనను ముంచేసిన వ్యాపారితో చేతులు కలిపి తన మత పిచ్చిని చాటుకుంటారు.
మరికొందరు నిస్సహాయకులుగా ఉంటారు…

ఈ నేపధ్యంలో
జరుగుతున్న ఆర్ధిక దోపిడిని నిలదీస్తూ
సాంసృతిక విష కౌగిలిని ప్రశ్నిస్తూ
తెలంగాణలో

దోపిడీ వ్యాపారి గో బ్యాక్ వెనక
ఇంకా పెద్ద కథే ఉంది..

You may also like...

Translate »