గువ్వల స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు

- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
- శంషాబాద్ బిఅర్ఎస్ సీనియర్ నాయకులు ఉద్యమ కారులు
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, ఆగస్ట్ 18 : మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పై చేసిన వాక్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని శంషాబాద్ మండల టిఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో సోమవారం మండల బిఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గువ్వల బాలరాజు, డాక్టర్ అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గువ్వల బాలరాజు తన స్థాయిని మరిచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోసహించబోమన్నారు. బిఅరెస్ సీనియర్ నాయకులు రాచమల్ల జయసింహ, చిన్నగండు రాజేందర్, రాచమల్ల రమేష్ గుంటి చరణ్.ఈ సందర్బంగా మాట్లాడుతూ గువ్వల బాలరాజు తన స్థాయిని మరిచి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి పిచ్చి కూతలు కూస్తున్నాడని, ప్రవీణ్ కుమార్ లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తును బంగారు బాట గా మార్చి ఎంతో మంది డాక్టర్లు ఇంజినీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్టర్లుగా తయారు చేశారని కానీ గువ్వల జాతికి ఎం చేశారో చెప్పాలని సవాల్ చేశారు.కార్యకర్తలు ఏడుస్తూ పార్టీ మారొద్దని మోర పెట్టుకున్నా కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా తన సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారిన గువ్వల ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు.
గువ్వల బాలరాజ్ మాటలు అదుపులో పెట్టుకుని తన మూలాలను గుర్తుపెట్టుకుని మాట్లాడాలని డిమాండ్ చేశారు. జాతిని పార్టీని అడ్డం పెట్టుకుని ఎదిగిన గువ్వల ఇప్పుడు జాతిని పార్టీని వదిలి ఒంటరిగా మిగిలిపోయాడని అన్నారు.కేసీఆర్ పెట్టిన బిక్షతో ఎమ్మెల్యే స్థాయికి ఎడిగిన బాలరాజు ఈరోజు తను స్థాయికి మించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.ఇప్పటి నుంచైనా ఎవరి స్థాయి ఏమిటో తెలుసుకొని మాట్లాడాలి అన్నారు.