ABN వార్త ఛానల్ యాజమాన్యం RSPకి క్షమాపణ చెప్పాలి : తగరం శ్రీకాంత్

జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా, ప్రతినిధి, ఆగస్టు 18:ఖమ్మం జిల్లా స్వేరో నెట్వర్క్ ఉపాధ్యక్షుడు తగరం శ్రీకాంత్ ప్రముఖ వార్తా ఛానల్ ఏబీఎన్ లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను “దళిత నేత” అని సంబోధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన కేవలం ఒక వర్గానికి చెందిన నాయకులు కాదని విద్యా, సమానత్వం, సాంఘిక న్యాయం కోసం కృషిచేసి అన్ని వర్గాల ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని తెలియజేశారు. సీనియర్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ మరియు ప్రముఖ ఛానల్ ఏబీఎన్ యాజమాన్యం వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పని పక్షంలో స్వేరోస్ నెట్వర్క్ నుండి ఊహించని విధంగా ప్రతిస్పందన ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా స్వేరో నెట్వర్క్ ఉపాధ్యక్షులు తగరం శ్రీకాంత్, వైరా నియోజకవర్గ అధ్యక్షులు కె నాగభూషణం, వైరా నియోజకవర్గ ఉపాధ్యక్షులు కృష్ణ పాల్గొన్నారు.
