శంకరపల్లిలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి

  • ముఖ్య అతిథిగా పాల్గొన్న రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి

జ్ఞాన తెలంగాణ, శంకరపల్లి:
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 375వ జయంతి సందర్భంగా శంకరపల్లి ప్రధాన చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి మాట్లాడుతూ, “సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ తొలిరాజు. బహుజన రాజ్యాధికారానికై పోరాడిన పరాక్రమవంతుడు. కులవ్యవస్థ, భూస్వామ్య దోపిడిపై గర్జించిన వీరుడు. మొఘల్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతుడు. గెరిల్లా యుద్ధ వ్యూహాలతో మొఘలులను గజగజ వణికించిన యోధుడు. బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం కృషి చేసిన కృషీవలుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్” అని అన్నారు.బీజేపీ నాయకులు, సేవ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నరేష్ కుమార్ మాట్లాడుతూ, “సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొట్టమొదటి బహుజన వీరుడు. నాటి పాలకుల నిరంకుశ పాలనపై యుద్ధం చేసిన యోధుడు. వర్గ, జాత్యాల వైవిధ్యాలు అధిగమించి బహుజన సంక్షేమానికి నిజమైన పురోగతిని సంకేతం చేసిన ధీరుడు” అని ప్రశంసించారు.అలాగే, నరేష్ కుమార్ అన్న కుమారుడు శ్రీ నిశాంత్ రచించిన “సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర” పుస్తకాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు కోలన్ శ్రీనివాస్ సహా పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

You may also like...

Translate »