నైతిక విలువలతో కూడిన వార్తలు సర్వదా శ్రేయస్కారం

- మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి
- కోటగిరి ప్రెస్ క్లబ్ సభ్యులు పోచారం భాస్కర్ రెడ్డిని సన్మానిస్తున్న దృశ్యం
జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్,కోటగిరి :
కోటగిరి ఉమ్మడి మండలాల ప్రెస్ క్లబ్ సభ్యులు ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా కోటగిరిలో ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభించారు, పోచారం భాస్కర్ రెడ్డికి కోటగిరి అంబేద్కర్ చౌరస్తాలో గజమాలతో స్వాగతం పలికారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ,ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభించారు అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్ సాయిబాబా గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి చేతిలో చరవాణి అందుబాటులోకి వచ్చిందని, పాత్రికేయులు ప్రభుత్వానికి నాలుగవ స్తంభం అని, నైతిక విలువలతో కూడిన వార్తలు రాయడం శ్రేయస్కరమని, ప్రజా సమస్యలపై నిరంతరము ప్రతిపక్ష పాత్ర వహించేవారే పాత్రికేయులని పేర్కొన్నారు, ప్రతి జర్నలిస్టు సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయాలని పేర్కొన్నారు, ప్రెస్ క్లబ్ కార్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక తాసిల్దార్ గంగాధర్, ఏఎంసి గైక్వాడ్ హనుమంతు, ఎస్సై సునీల్, విండో చైర్మన్లు వెనిగళ్ళ సునీల్ కుమార్, కూచి సిద్దు, మాజీ వైస్ ఎంపీపీ బాల్ థాకరే, మాజీ జెడ్పిటిసి శంకర పటేల్, మాజీ జెడ్పిటిసి శంకర్, నాయకులు మాశెట్టి ఆదిత్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ హైమద్, నీరడి గంగాధర్ ,జుబేర్, జమీల్, తదితరులు పాల్గొన్నార