అటల్ బిహారీ వాజపేయి సేవలు మరువలేనివి

  • అటల్ బిహారీ వాజపేయి గారి 7వ వర్ధంతి సందర్భంగా శంకరపల్లిలో ఘన నివాళులు
  • రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొలన్ ప్రతాపరెడ్డి
  • ముఖ్య అతిథిగా జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి

జ్ఞాన తెలంగాణ, శంకరపల్లి:
భారతరత్న, పద్మ విభూషణ్, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి గారి 7వ వర్ధంతి పురస్కరించుకొని శంకరపల్లి ప్రధాన కూడలి ఇంద్రారెడ్డి విగ్రహం వద్ద బీజేపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొలన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ – “సూర్యచంద్రులు ఉన్నంతవరకు అటల్ బిహారీ వాజపేయి పేరు నిలిచే ఉంటుంది. పరిణతి చెందిన రాజకీయ నైపుణ్యం, విప్లవాత్మక నిర్ణయాలతో దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించిన మహానాయకుడు ఆయన” అని పేర్కొన్నారు.

ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధికార ప్రతినిధి తోండ రవి మాట్లాడుతూ – “వాజపేయి గారు నిజమైన దేశభక్తుడు. ఆయన మనసులో ఎల్లప్పుడూ పేదల పట్ల ప్రేమ, సేవ ఉండేది. మంచితనమే ఆయన శక్తి. కష్టమైన సమస్యలు వచ్చినా శాంతంగా, సహనంతో పరిష్కరించేవారు. మంచి పాలన ఎలా ఉండాలో చూపించిన నాయకుడు ఆయన. అందుకే అందరూ ఆయనను ఇష్టపడ్డారు, గౌరవించారు” అని అన్నారు.

కార్యక్రమంలో మాజీ మున్సిపాలిటీ అధ్యక్షులు, బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వాజపేయి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

You may also like...

Translate »