పొంగిపొర్లుతున్న కమ్మెట కాలువ

  • పొంగిపొర్లుతున్న కమ్మెట కాలువ
  • ప్రొద్దుటూరు గ్రామ ప్రజల ముఖాల్లో ఆనందం
  • బొల్లారం వెంకట్ రెడ్డి ఆర్థిక సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్న ప్రొద్దుటూరు గ్రామ ప్రజలు,
  • ప్రొద్దుటూరు మాజీ కో ఆప్షన్ మెంబర్ కవేలి జంగారెడ్డి.

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: ప్రొద్దుటూరు గ్రామంలోని పెద్ద చెరువు నిండాలని, ఎప్పుడూ నిండుగా ఉండాలని కలలు కనిన వారిలో, ప్రొద్దుటూరు గ్రామ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు కవేలి జంగారెడ్డి ముందు వరసలో నిలుస్తారనడంలో సందేహం లేదు.
ఈ సందర్భంగా ప్రొద్దుటూరు గ్రామ మాజీ కో ఆప్షన్ మెంబర్ కవేలి జంగారెడ్డి మాట్లాడుతూ..,
“కమ్మెట కాలువ పునర్నిర్మాణంలో నేను ముందుండి మాత్రమే పని చేయించాను. గ్రామ పెద్దలు, యువకులు పూర్తిగా సహకరించారు. అయితే, ఆర్థిక సహకారం విషయంలో నా పాత్ర ఏమీ లేదని, ప్రొద్దుటూరు గ్రామ మాజీ ఎంపీటీసీ బొల్లారం వెంకట్ రెడ్డి గారు తన సొంత నిధులు సమకూర్చి, తన వంతు సహాయం అందించారని, కాలువ విషయంలో నా ద్వారా ఖర్చు చేసిన ప్రతి రూపాయి మాజీ ఎంపీటీసీ బొల్లారం వెంకటరెడ్డి గారికి చెందినదేనని, కాలువ మళ్లీ ఉప్పొంగి ప్రవహిస్తుండడంలో ఆయన పాత్ర చాలా కీలకమైనదని ఆయనకు ప్రొద్దుటూరు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. నేడు భారీ వర్షాల వల్ల కాలువ పొంగి, చెరువులోకి జలపాతం లాగా ప్రవహించడంతో, గ్రామ ప్రజలు ఆనంద వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు.

You may also like...

Translate »