రైతులకు ముఖ్యమైన అలర్ట్. రైతు బీమా దరఖాస్తుకు ఒక్కరోజే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్తగా పట్టాదారు పాస్‌బుక్కులు పొందిన రైతులకు రైతు బీమా పథకం అమలు కోసం ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. 1966 ఆగస్టు 14 నుంచి 2007 ఆగస్టు 14 మధ్యలో జన్మించి, ఈ సంవత్సరం జూన్ 5వ తేదీ నాటికి పాస్ పుస్తకం పొందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తుతోపాటు పట్టాదారు పాస్‌బుక్, రైతు ఆధార్ కార్డు నామినీ ఆధార్ కార్డులను ఏఈవోకు అందజేయాలి.