క్షణం క్షణం..భయం భయం

క్షణం క్షణం..భయం భయం
జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి,స్మార్ట్ ఎడిషన్ (ఆగష్టు 12):
కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో ఓ ఇంటి పైనుంచి 11 కెవి విద్యుత్ వైర్లు పోవడంతో వర్షాలు పడినప్పుడు బిల్డింగ్ కు ఎర్తింగ్ వస్తున్నట్లు బాధితులు తెలిపారు. ఇల్లు నిర్మాణం చేసినప్పటి నుంచి విద్యుత్ స్తంభాన్ని వేరు చెయ్యమని కోరామన్నారు. కానీ నేటి వరకు సంబంధిత అధికారులకు దరఖాస్తు రూపంలో విన్నవించు కున్న లాభం లేకపోయిందన్నారు. వర్షం పడినప్పుడు బయటికి రాలేకపోతున్నమని ఏ క్షణం ఏమైనా జరుగుతుందో నాని బాధితులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.