పొద్దుటూర్ లో పాముల కలకలం

- పదో వార్డులో పాముల పీడ
- భయంతో వణికిపోతున్న కాలనీవాసులు
- ప్రొద్దుటూరు గ్రామంలో క్షణ క్షణం భయం…, భయం…,
- కనీసం స్తంభాలకు లైట్లు ఏర్పాటు చేసి, చీకటి సమస్య తొలగించాలని విజ్ఞప్తి
- సర్పనాశక మందు పిచికారీ చేయాలని డిమాండ్ చేస్తున్న పదో వార్డు ప్రజలు
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:
గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా, శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలోని పదో వార్డు చివరి ప్రాంతాలు జలమయంగా మారాయి. రోడ్లపై నిల్వ నీటితో పాటు పచ్చిక పెరగడంతో, నాగుపాములు, జేరిపోతులు గల్లీల్లో తిరిగి ఇళ్ల గుమ్మాల వరకు చేరుకుంటున్నాయి. పిల్లలు బయటకు రావడానికి గజగజ వనికి పోతున్నారు.ఇది ఇలా ఉంటే మరోవైపు, పదో వార్డు లోని వీధుల్లో విద్యుత్ దీపాలు పూర్తిగా వెలగడం లేదు. స్తంభాలపై ఉన్న లైట్లు పనిచేయడం లేదని, చీకటి కారణంగా పాములు ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉంటాయో గమనించలేకపోతున్నామంటూ వారు తెలిపారు. వీధి దీపాలను వెంటనే పునరుద్ధరించాలని, రాత్రిళ్లు వీధుల్లో నడవడం ప్రాణాలకు ముప్పుగా మారిందని. విద్యుత్ దీపాలు లేక చీకట్లో ఏం పొంచి ఉందో ఎవరికీ తిరగడం లేదని వాపోతున్నారు.పాములు పక్కగానే వెళ్తున్నా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు గ్రామ సెక్రటరీకి విజ్ఞప్తి చేస్తూ, వెంటనే ప్రతి గల్లీలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, పాముల సంచారాన్ని అరికట్టేందుకు గడ్డి, చెత్త, నిల్వ నీరు పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు. అలాగే పాములు రాకుండా సర్పనాశక పొడి లేదా ప్రత్యేక సర్పనివారణ మందులు పిచికారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
“వర్షం మాకు వరమయినా, పాములు మాకు శాపంగా మారకూడదని కాలనీ ప్రజలు ఆవేదన చెందుతున్నారు.