రాజకీయ లబ్ధి కోసమే బిజెపి, టిఆర్ఎస్ పార్టీల డ్రామాలు :ఎమ్మెల్యే ఠాగూర్

రాజకీయ లబ్ధి కోసమే బిజెపి, టిఆర్ఎస్ పార్టీల డ్రామాలు : ఎమ్మెల్యే ఠాగూర్.
జ్ఞాన తెలంగాణ రామగుండం అసెంబ్లీ ప్రతినిధి:
రామగుండం శాసనసభ్యులు శ్రీ ఎం ఎస్ రాజశేఖర్ గారు బిసి రిజర్వేషన్ల అంశం పైన కీలక వాక్యాలు చేశారు. ఎమ్మెల్యే రాజ్ మక్కా సింగ్ గారు మాట్లాడుతూ బిజెపి మరియు టిఆర్ఎస్ పార్టీలు బీసీ.లపై నిజమైన ప్రేమ లేదని వారు కేవలం రాజకీయ లబ్ధి కోసమే డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న బిసి రిజర్వేషన్ బిల్లుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక బీసీ బిడ్డగా నేను ఈ అన్యాయాన్ని కోరుకునే ప్రసక్తే లేదు., కేంద్ర ప్రభుత్వము బిజెపి బీసీలను మోసం చేస్తే దీనిమీద మా పోరాటం ముంబరంగా కొనసాగుతుంది. బిజెపి బిఆర్ఎస్ పార్టీలు బీసీల హక్కుల విషయంలో కపట వైఖరి ప్రదర్శిస్తే ప్రజల మధ్య ఆ పార్టీలను ఎండగడతాయి. బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి దగ్గర ఆమోదించాలన్న డిమాండ్ పై మేము కట్టుబడి ఉన్నాము అని ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు. ఢిల్లీలో జరిగే మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్సీ కొండా సురేఖ గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి వాకిటి శ్రీహరి గారు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.