భారతదేశం భిన్న మతాల, కులాల సమూహం అని బాన్సువాడ నియోజక వర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మించిన CSI చర్చినీ ఆయన గురువారం ప్రారంభించారు. మన ఆచారాలను గౌరవిస్తూ, ఇతరుల ఆచారాలను కూడా గౌరవించడం మానవత్వం. సమాజానికి శాంతి, ప్రేమను ప్రభోదించిన శాంతి దూత ధైవకుమారుడు యేసు క్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకాలు అని తెలియజేసారు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా శాంతి, సామరస్యాలను పాటిస్తూ సమస్త మానవాళికి సుఖ, శాంతులను అందించాలని ఏసు క్రీస్తు ప్రభువును కోరారు. కార్యక్రమంలో వర్ని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు సురేష్ బాబా తదితరులు పాల్గొన్నారు.