– శ్రీ శతావధాని అంజయ్య ఆధ్వర్యంలో ఘనమైన కార్యక్రమం – కార్యక్రమంలో పాల్గొన్న నవయువ కవులు -కళాకారులు,పండితులు,తత్వవేత్తలు
జ్ఞానతెలంగాణ,వికారాబాద్ :
వికారాబాద్ జిల్లా,చక్రం పల్లి గ్రామంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో పద్య పద భారతి శతకవి కళాకారుల సమ్మేళనం ను శ్రీ శతావధాని అంజయ్య ద్వారా శతకవులతో,కళాకారులతో,కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎందరో నవయువ కవులు కళాకారులు, పండితులు, తత్వవేత్తలు, పాల్గొన్నారు ఇందులో భాగంగా శంకర్పల్లి అధ్యాపకులు కె. శ్రీరాములు ఆంగ్ల భాష ఉపాధ్యాయులు, అనంత కిషన్ రావు బి. సుధాకర్ జంతు శాస్త్ర అధ్యాపకులు, బి.శీను తెలుగు అధ్యాపకులు, డాన్స్ మాస్టర్ జగన్ తమ కవితలను వినిపించారు
పద్య పద భారతి శతకవి కళాకారుల సమ్మేళనం లో పాల్గొన్న నవయువ కవి శ్రీ సుధాకర్ (జువాలజీ అధ్యాపకులు) కవితా శీర్షిక “అమ్మ “
“అమ్మ “
నాకుజన్మనివ్వడానికి నీవు పునర్జన్మనుఎత్తినావు , మాటలురాని నేనుమారాముచేస్తుంటే మాన్పించుటకై లాలి పాటలు పాడినావు, లాలి పాటలతో లోక సంగతులన్నీ చెప్పావు, పొత్తిళ్ళలో ఉన్న నాకు పున్నమి చంద్రుణ్ణి మామను చేశావు నేను బాధపడితే నివ్వువిలవిలలాడుతావు , నా ఎదుగుదలను చూసి నివ్వు మురిసిపోతావు, నేను నవ్వితే నీ బాధలన్నీ మరిచి పోతావు , నన్ను చూస్తూ ఈ ప్రపంచాన్నీ మరిచి పోతావు, ఎన్ని జన్మలదో ఈ పేగు బంధం , వర్ణించలేనిది నీ ప్రేమబంధం, తీర్చలేనిది నీ ఋణ బంధం
– (సుధాకర్) పర్వేద
“శివా!”
ఉపవాసం పేరుతో అన్నీ ఉన్న వాడికి ఆకలి విలువ తెలుపుతావు , జాగారం పేరుతో అలసిపోయినవాడి నిద్ర విలువ తెలుపుతావు, అర్ధనారీశ్వర రూపంతో భార్యాభర్తల బంధాన్ని తెలుపుతావు, లింగాకారంతో ఈ సృష్టి నియమాన్ని తెలుపుతావు , త్రినేత్రంతో ముందుచూపును తెలుపుతావు, విభూది పూసుకుని అందం,సంపద కాదు చివరికి మిగిలేది బూడిదే అని తెలుపుతావు