పాలిటెక్నిక్ డిప్లొమా ప్రవేశాల తుది విడత వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభం

జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్ :

తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, TGPOLYCET–2025 డిప్లొమా కోర్సుల తుది విడత వెబ్ కౌన్సిలింగ్ జూలై 24, 2025 నుండి రాష్ట్రవ్యాప్తంగా హెల్ప్ లైన్ సెంటర్లలో ప్రారంభమవుతోంది. పాలిటెక్నిక్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలలలో ప్రవేశాల కోసం, ఈ తుది విడతలో పాల్గొనడానికి అభ్యర్థులు సన్నద్ధమవ్వాలి.ఈ కౌన్సిలింగ్‌లో మొదటి విడతలో సీటు పొందిన అభ్యర్థులు కూడా తమకు బెటర్‌మెంట్ అవసరమైతే తిరిగి ఆప్షన్లు ఇవ్వవచ్చు. అలాగే, మొదటి విడతలో సీటు పొందని అభ్యర్థులు కూడా ఈ తుది విడతలో అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అయితే మొదటి విడతలో కౌన్సిలింగ్‌కు హాజరుకాకపోయిన అభ్యర్థులు, తుది విడతకు కొత్తగా స్లాట్ బుక్ చేసుకుని ధృవపత్రాల పరిశీలనకు హాజరుకావలసి ఉంటుంది.ఈ సందర్భంగా TG POLYCET హెల్ప్ లైన్ సెంటర్‌గా గుర్తింపు పొందిన ప్రభుత్వ పాలిటెక్నిక్, వరంగల్ కేంద్రంలో ప్రక్రియకు కావలసిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అభ్యర్థులు సకాలంలో అవసరమైన ధృవపత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ *డా. బైరిప్రభాకర్

You may also like...

Translate »