పోస్టు కార్డు ఉద్యమానికిశ్రీకారం

  • కేసీఆర్ జపం తప్ప పాలన తెల్వదు
  • సీఎం రేవంత్ పై ఎమ్మెల్సీ కవిత విమర్శలు
  • కాంగ్రెస్ కు ఓటు వేసినందుకు బాధపడుతున్న ఆడ బిడ్డలు
  • కాంగ్రెస్ నేతలతోనే ఇందిరమ్మ కమిటీలు
  • అమ్మ ఒడి వాహనాల్లో డీజిల్ పోసే పరిస్థితి లేదు
  • మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్
  • సానియా గాంధీకి పోస్టు కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కవిత

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి :
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆడిపోసుకోవడం. ఆయన జపం చేయడం తప్ప సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన తెల్వదని తెలంగాణ జాగృతి వ్యవస్థపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కేశంపేట్ మండలం కాకునూరు గ్రామంలో పోస్టు కార్డుల ఉద్యమానిక శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సభలో కవిత మాట్లాడుతూ… ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ప్రతి మహిళకు రూ.2.500 ఇస్తామని చెప్పి వాగ్దానం చేసిందన్నారు. అందుకే ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ.. తెలంగాణ జాగృతి తరఫున ఢిల్లీలోని సోనియాగాంధీకి పోస్టు కార్డు ద్వారా పంపుతున్నామని కవిత తెలిపారు
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందరో ఆడ బిడ్డల క న్నీళ్లను తుడిచారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామంటూ ఊదరగొట్టా రని.. రాష్ట్రం ఒక్క స్కూటీ ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు.రాష్ట్రంలో కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేసిన పేదింటి తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచిన వ్యక్తి ఒక్క కేసీఆరే అని అన్నారు. ఎలాగైన అధికారంలోకి రావాలనే కుట్రతో అమ లుకు సాధ్యం కాని హామీలు ఇచ్చారని మండిపడ్డారు.
తెలంగాణలో 18 నెలలుగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలన చూసి గోస పడుతున్నారని.. అనవసరంగా ఓట్లు వేసి గెలిపించామనే స్థితికి ఆడ బిడ్డలు వచ్చారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని
ప్రభుత్వం అమలు చేసేందుకు తమ పోరాటం ఆగదని అన్నారు. ఏదైనా కొట్లాడితే వస్తుందని.. నాడు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు, విద్యార్థులతో మమేకమై కేసీఆర్ పోరాటం చేశారని, తెలంగాణను సాధించారని గుర్తు చేశారు. బీఆ ర్ఎస్ అధికారంలో వచ్చాక పాలమూరురంగారెడ్డి ప్రాజెక్ట్ ను 90 శాతం పూర్తి చేశారని పది శాతం పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టి, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ కూడా తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని.. కానీ కాంట్రాక్టర్లకు రూ.వందల కోట్లు ముట్టజెప్పారని కవిత ఫైర్ అయ్యారు.

You may also like...

Translate »