భూమికి తిరిగి వచ్చాక క్వారంటైన్‌కు శుభాంశు శుక్లా

  • ఈ నెల 14న భూమికి తిరిగి రానున్న శుక్లా సహా వ్యోమగాములు
  • కాలిఫోర్నియాలో ల్యాండ్ కాగానే క్వారంటైన్‌కు తరలింపు
  • వారం రోజుల పాటు వారి ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను పర్యవేక్షించనున్న ఇస్రో వైద్యులు

జ్ఞానతెలంగాణ,సెంట్రల్ డెస్క్ :
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భూమికి తిరిగి వచ్చిన అనంతరం వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లిన శుభాంశు శుక్లా, ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ఈ నెల 14న భూమికి తిరిగి రానున్నారు. జులై 15న కాలిఫోర్నియా తీరంలో వారు ల్యాండ్ కాగానే వారిని ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.వ్యోమగాములు అంతరిక్షంలో భారరహిత స్థితిని అనుభవించినందున భూవాతావరణానికి వారి శరీరాలు అలవాటు పడేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇస్రోకు చెందిన వైద్యాధికారులు వారం రోజుల పాటు వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను నిరంతరం పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా, అంతరిక్షంలో వ్యోమగాముల శరీరాలపై పడిన ప్రభావాన్ని కూడా వైద్యాధికారులు అధ్యయనం చేయనున్నారు.

You may also like...

Translate »