లంచం కేసులో మిర్యాలగూడ డిప్యూటీ తహశీల్దార్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ..!!

లంచం కేసులో మిర్యాలగూడ డిప్యూటీ తహశీల్దార్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ..!!


జ్ఞానతెలంగాణ,నల్లగొండ :

నల్లగొండ జిల్లా పౌర సరఫరాల శాఖలో మిర్యాలగూడ విభాగానికి చెందిన డిప్యూటీ తహశీల్దార్ షేక్ జావీద్ అవినీతి కేసులో పట్టుబడ్డాడు. ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, స్వాధీనపరచిన మూడు వాహనాలకు సంబంధించి పంచనామా నిర్వహణ చేసి నివేదికను న్యాయస్థానానికి పంపించేందుకు బాధితుడిని లంచం కోసం డిమాండ్ చేశాడు.
ఆధికారిక వివరాల ప్రకారం, షేక్ జావీద్ మొదటగా రూ. 1,00,000 లంచం డిమాండ్ చేసి, తర్వాత రూ. 70,000 కు తగ్గించాడు. ఈ మేరకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా, తెలంగాణ అవినీతినిరోధక శాఖ (ACB) అధికారులు 2025 జూన్ 7న కేసు నమోదు చేసి, ఆయనను అరెస్ట్ చేశారు..!!

You may also like...

Translate »