నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్య

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్య


జ్ఞానతెలంగాణ,రాజేంద్రనగర్, జులై 02 :

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్య గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పుప్పాలగూడలో బుధవారం హత్య ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి కథనం ప్రకారం వెస్ట్ బెంగాల్ కు చెందిన రోషన్ (35) వారం రోజుల క్రితం మణికొండ మున్సిపల్ పరిధిలోని పుప్పాలగూడకు వలస వచ్చాడని తెలిపారు. పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడని. మురళీధర్ అనే వ్యక్తి దగ్గర పని చేస్తున్నాడని మంగళవారం సుమారు అర్ధరాత్రి సమయంలో రోషన్ దారుణ హత్య గురయ్యారని తెలిపారు. స్నేహితుల మధ్య జరిగిన గొడవలు అతనిని చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యానంతరం రోషన్స్ స్నేహితుడు పరారయ్యాడని అతడే రోషను చంపేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లూస్ టీం, జాగిలాలని రప్పించి వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి తెలిపారు.

End

You may also like...

Translate »