కాగజ్ నగర్ లో ప్రవీణ్ కుమార్ విస్తృత పర్యటన

కాగజ్ నగర్ లో ప్రవీణ్ కుమార్ విస్తృత పర్యటన1


ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కాంగ్రెస్ అవినీతి


పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోమని హెచ్చరిక

– పలువురి పరామర్శ,పండ్ల పంపిణీ

డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు.


జ్ఞానతెలంగాణ,కొమురంభీం ఆసిఫాబాద్ :
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో, అవినీతి అక్రమాలు జరిగాయని,అర్హులైన వారికి ఇళ్లు ఇవ్వకుండా,లంచం ఇచ్చిన వారికే ప్రాధాన్యత ఇచ్చారని బిఆర్ఎస్ నాయకులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.అధికారులు గ్రామ స్థాయిలో సర్వే చేయకుండానే లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారని,ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సి ఆధారంగా సెలెక్ట్ చేశామని చెప్పడం దారుణమన్నారు. ఇపుడు పేదల సమస్యలు కాంగ్రెస్ నాయకులు,అధికారులు తీరుస్తారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీరుస్తుందా? అని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు టెక్నాలజీకి వేయలేదని,రేవంత్ రెడ్డికి వేశామని అందుకే కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ రోజు కాగజ్ నగర్ పట్టణంలోని వార్డు నెం.1లో గుంటూరు కాలనీ,ఎఫ్ కాలనీ మరియు డి కాలనీలో ఆయన పర్యటించారు. ఇళ్లు లేని పేద కుటుంబాలను కలిశారు. అర్హులైనా ఇల్లు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
కందుల పుష్పలీల మరియు ఉషాదేవి ల పేర్లు మొదటి లిస్టులో వచ్చినప్పటికీ ఒంటరి మహిళ/ వృధ్ధ మహిళ అనే కారణంతో చివరకు ఇల్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లేదా విధివిధానాల్లో ఎక్కడా ఒంటరి/ వృద్ధ మహిళలు అనర్హులని చెప్పలేదని స్పష్టం చేశారు.కానీ అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు.
కాంగ్రెస్ నాయకులు మరియు అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడి అర్హులైన పేదలకు ఇళ్ల ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పి,ప్రజలను దోచుకొనే పాలనగా మారిందన్నారు. తక్షణమే అర్హులైన వారికి ఇళ్లు ఇవ్వకపోతే బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరుంచారు.

అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు బాధితులను పరామర్శించారు. వారికి పండ్లు పంపిణీ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న బాలస్వామి కుటుంబాన్ని కలిశారు.మెరుగైన వైద్య సహాయం కోసం హైదరాబాద్ లోని డాక్టర్లతో మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేయడంతో బాలస్వామి కూతురిని చదివించాలని,చదువు విషయంలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. హై బీపితో బాధపడుతూ మంచానికే పరిమితమైన దౌలత్ కుటుంబాన్ని కలిసి వైద్యఖర్చుల నిమిత్తం కొంత ఆర్థిక సాయం అందించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు తాజ్ మహమ్మద్ బాబా,మాజీ కౌన్సిలర్ మిన్హాజ్,జాక్,యూత్ నాయకులు కాశిపాక రాజు,మహిళా నాయకురాలు వరలక్ష్మి,కమల తదితరులు పాల్గొన్నారు.

  1. ↩︎

You may also like...

Translate »