జ్ఞానతెలంగాణ, పెబ్బేర్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా సోమవారం పెబ్బేర్ మున్సిపాలిటీ కేంద్రం, మున్సిపాలిటీ పరిధి గ్రామాలలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ అశోక్ రెడ్డి,ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రవీందర్,తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ మురళి గౌడ్, పెబ్బేర్ పోలీస్ స్టేషన్ లొ ఎస్సై గంగిరెడ్డి యుగంధర్ రెడ్డి,ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు,గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయితీ కార్యదర్శుల చేత జెండా ఎగురవేసి తెలంగాణ విశిష్టతను వివరించారు,ఈ కార్యక్రమంలో అధికారులు ఎంపీ ఓ రోజారెడ్డి,ఆర్ ఐ రాఘవేంద్రరావు,మార్కెట్ చైర్మన్ ప్రమోదిని,వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్ గౌడ్,కాంగ్రెస్ నాయకులు దయాకర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.