మరికొద్ది నిమిషాల్లో శంకర్‌పల్లి పట్టణానికి రానున్న ఎమ్మెల్యే కాలే యాదయ్య

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న చేవెళ్ల ఎమ్మెల్యే


జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి:
చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి అంకితంగా పనిచేస్తున్న శాసనసభ్యులు కాలే యాదయ్య ఈరోజు మరికొద్ది నిమిషాల్లో శంకర్‌పల్లి పట్టణానికి రానున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమ స్థలంలో ఇప్పటికే అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను పూర్తిచేశారు.

ప్రభుత్వం మంజూరు చేసిన పట్టణాభివృద్ధి నిధులతో ఈ రోడ్ల పనులు ప్రారంభించనున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పట్టణ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న రహదారి అభివృద్ధి కల నెరవేరనుంది.

ఈ సందర్భంగా శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ యోగేష్ మాట్లాడుతూ, “పట్టణాభివృద్ధి కోసం నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ, ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నాం” అని తెలిపారు.

సీసీ రోడ్లు పూర్తయిన తర్వాత వర్షాకాలంలో నీరు నిలిచే సమస్యతో పాటు, ప్రజలకు ప్రయాణ సౌకర్యం కలగనుందని అధికారులు తెలిపారు. శంకుస్థాపన అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడనున్నట్లు సమాచారం.

You may also like...

Translate »