ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన
- దళిత స్పీకర్ను అవమానిస్తే సహించేది లేదు: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి - September 7, 2026
- అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో లీలావతి బయానంద్ ముందస్తు అరెస్టు - September 7, 2026
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026

“ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని ప్రారంభించనున్న సీఎం
అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి,రూ. 12,600 కోట్ల బడ్జెట్ తో “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకం
ఒక్కో యూనిట్ కు రూ. 6 లక్షల చొప్పున వంద శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు అందించనున్న ప్రభుత్వం.పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు సోలార్ పంపుసెట్లను పంపిణీ చేయనున్న సీఎం
అనంతరం సీతారామాంజనేయ ఆలయాన్ని దర్శించుకుని బహిరంగ సభకు హాజరు కానున్న సీఎం
కార్యక్రమం అనంతరం స్వగ్రామం కొండారెడ్డిపల్లెకు చేరుకోనున్న ముఖ్యమంత్రి
కొండారెడ్డిపల్లెలో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న సీఎం
సాయంత్రం కొండారెడ్డిపల్లె నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న సీఎం.
