“ఆత్మహత్యే శరణ్యం” — అధికారుల నిర్లక్ష్యంపై కౌసల్య ఆవేదన

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్ గ్రామానికి చెందిన అలవాల కౌసల్య అనే మహిళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించారు.తన ఇంటి స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని, ఈ విషయం పంచాయతీ, రెవిన్యూ, పోలీస్ అధికారులకు తెలియజేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని కౌసల్య ఆరోపించారు. అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆక్రమణదారులు వాటిని పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తున్నారని తెలిపారు.అక్రమ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సమయంలో ఆమెపై దాడులకు యత్నించారని కౌసల్య వాపోయారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఆక్రమణదారులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోకపోతే, తనకు ఆత్మహత్యే శరణ్యమవుతుందని కౌసల్య ఆవేదన వ్యక్తం చేశారు.

You may also like...

Translate »