ఏడుగురు టీచర్లకు ఒక్కడే విద్యార్థి.. అయినా టెన్త్‌ ఫెయిల్‌

ఏడుగురు టీచర్లకు ఒక్కడే విద్యార్థి.. అయినా టెన్త్‌ ఫెయిల్‌


ప్రభుత్వ పాఠశాలల దుర్గతిని చాటుతున్న ఉదంతమిది. ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్‌ జిల్లా భద్రకోట్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతికి ఒకే ఒక్క విద్యార్థి ఉన్నాడు. అతడికి అన్ని సబ్జెక్టులు బోధించడానికి ఏడుగురు ఉపాధ్యాయలు ఉన్నారు. అయినా ఆ ఒక్కగానొక్క విద్యార్థి ఇటీవలి పరీక్షల్లో ఫెయిలయ్యాడు. ఈ పాఠశాల చాలా మారుమూల ప్రాంతంలో ఉంది. దాదాపు 5 – 7 కిలోమీటర్ల పరిధిలో ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు కేవలం ఏడుగురు విద్యార్థులు చదువుతున్నారు. కొత్త విద్యాసంవత్సరంలో పదో తరగతికి ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. ఫెయిలైన విద్యార్థి కూడా వీరికి జత కలిసి మళ్లీ చదువుతున్నాడు. సమీప గ్రామాల నుంచి అయిదో తరగతి పాసైన పిల్లలను పాఠశాలకు తీసుకురావాలని, విద్యాప్రమాణాలు పెంచాలని భద్రకోట్‌ ఉపాధ్యాయులకు కఠినమైన హెచ్చరికలు జారీ చేశామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

You may also like...

Translate »