హైదరాబాద్ అవుట్ర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది.కొత్త కారు ముగ్గురి ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. కొత్త కారులో జాలీగా వెళ్లిన దీపేష్ అగర్వాల్ (23), మల్పానీ (22), ప్రియాన్షు (23) కారులో వెళ్లగా.. ఓఆర్ఆర్పై ఆగి ఉన్న వాహనాన్ని ఢీ కొట్టారు. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఇద్దరు అక్కడే సజీవదహనం కాగా.. మరో యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు. దీపేష్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.