శ్రామికులకు మనమిచ్చే గౌరవమే నిజమైన మే డే ఉత్సవం



మే 1 – ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా, అన్ని స్థాయిల శ్రామికులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజున మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం – శ్రమ చేసే ప్రతి మనిషి సమాజ నిర్మాణంలో ఒక శిల్పి. పని చిన్నదా, పెద్దదా అనేది కాదు – పని చేసే వాడిని గౌరవించడం నిజమైన మానవత్వం. మట్టిలో కలిసే కార్మికుల శరీరమే, ఈ దేశ నిర్మాణానికి పునాది. అందుకే ఎంత చిన్న పనైనా గౌరవించాలి, ఎంతే పెద్ద వాడైనా వినయంగా ఉండాలి.” ఈ మే డే సందర్భంగా ప్రతి ఒక్కరం ఒక స్పష్టమైన సందేశం అందుకుందాం, అట్టడుగు నుండి పై స్థాయి వరకు అన్ని రకాల కార్మికులను సమానంగా గౌరవించాలి. శ్రమకు మతం లేదు – కులం లేదు – ప్రాంతం లేదు. ఉన్నది కేవలం శ్రమకు విలువ, శ్రమజీవికి గౌరవం!

శ్రామికుల హక్కుల కోసం పోరాడిన హేయ్ మార్కెట్ ఉద్యమ వీరులను స్మరిస్తూ, బి.ఆర్. అంబేద్కర్, జ్యోతిరావు ఫులే, పెరియార్ వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని మనమందరం సమానత్వం, శ్రామిక హక్కులు, మానవ విలువల బాటలో నడవాలి. ఈ రోజు మనం తీసుకోవలసిన ప్రతిజ్ఞ, శ్రమించే ప్రతి చేతికి గౌరవం – జీవించే ప్రతి మనిషికి న్యాయం చేకూరినప్పుడే, మే డేకు నిజమైన సార్ధకత ఏర్పడుతుంది.


– నాని రత్నం
జ్ఞాన తెలంగాణ ప్రతినిధి

You may also like...

Translate »