జాతీయ ఒలంపియాడ్ లో శ్రీ చైతన్య శంకర్ పల్లి విద్యార్థుల అసాధారణ విజయాలు
– 186 బహుమతులు, 2 ప్రత్యేక ఘనతలు – విద్యార్థుల ప్రతిభ కు ఎంఈఓ అక్బరుద్దీన్, ప్రశంసలు – మీ పిల్లల ప్రతిభను దేశస్థాయికి చేర్చే పాఠశాల శ్రీ చైతన్య – ప్రిన్సిపల్ రాజేష్ కుమార్
జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండలంలోని శ్రీ చైతన్య విద్యాసంస్థలు ఇటీవల నిర్వహించిన భారత జాతీయ ప్రతిభా అన్వేషణ పోటీ (ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలంపియాడ్)లో జాతీయస్థాయిలో అద్భుత విజయాలు సాధించిన చైతన్య శంకర్ పల్లి పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను దేశవ్యాప్తంగా చాటారు. ఈ పోటీలో పాఠశాల విద్యార్థుల విజయం మండలానికే గర్వకారణంగా నిలిచింది.
నాల్గో తరగతి విద్యార్థిని ఇంద్రపాటి లక్ష్మీ ప్రసన్న ల్యాప్‌టాప్, బంగారు పతకం, ప్రశంసాపత్రం అందుకోగా, తొమ్మిదో తరగతి విద్యార్థి తనీష్ రెడ్డి ట్యాబ్లెట్, బంగారు పతకం, ప్రశంసాపత్రంతో ప్రథమ బహుమతిని గెలుచుకున్నాడు. మరో 184 మంది విద్యార్థులు వివిధ బహుమతులు, బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలను అందుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ రాజేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన అభినందన కార్యక్రమానికి మండల విద్యాధికారి అక్బరుద్దీన్, శంకర్‌పల్లి సబ్ ఇన్స్పెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలు తన చేతుల మీదుగా అందజేసిన ఎంఈఓ అక్బరుద్దీన్ మాట్లాడుతూ,పల్లె విద్యకు ఉన్న స్థాయి, పట్టుదల ఈ రోజు మరోసారి నిరూపితమైంది. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులు జాతీయస్థాయిలో తమ ప్రతిభను చాటడం అభినందనీయం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల విజయం వెనుక ఉపాధ్యాయుల కృషి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో కీలకమని కొనియాడారు. ఇలాంటి వేదికలు భవిష్యత్తులో విద్యార్థులకు విశ్వాసాన్ని ఇస్తాయని తెలియజేశారు.మీ విజయాలు ఎప్పటికీ గుర్తుండిపోయే ఘనవిజయంగా నిలిచిపోవాలని విద్యార్థులను అభినందించారు.శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ మీ పిల్లల ప్రతిభను దేశ స్థాయికి చేర్చే పాఠశాల శ్రీ చైతన్య శంకర్ పల్లి అని పాఠశాల అని అన్నారు .ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతిక యుగంలో విద్యార్థులకు సరైన దిశ, మార్గనిర్దేశనం ఎంతో అవసరమని, శ్రీ చైతన్య పాఠశాలలో మేము విద్యను క్రమశిక్షణతో మేళవించి, విద్యార్థులను భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఈ ఒలంపియాడ్ వేదికలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. వారి ఈ ఘనతకు దోహదపడిన ఉపాధ్యాయ బృందానికీ నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్,డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య,ఎజీఎం పల్లె వెంకట్ , హై స్కూల్ కోఆర్డినేటర్ స్వామి ,ప్రైమరీ కోఆర్డినేటర్ జ్యోతి , ప్రీ ప్రైమరీ కోఆర్డినేటర్ వీరమని,ఏవో చంద్రశేఖర్ రెడ్డి,డీన్ కిరణ్ కుమార్ , సీ బ్యాచ్ ఇంచార్జ్ ఆస్మా,ప్రైమరీ ఇంచార్జ్ రాధిక,ఇతరఉపాధ్యాయులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.