ప్రధాన మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

ప్రధాన మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం రూరల్ ప్రతినిధి, ఏప్రిల్ 11 :

మాజీ భారత ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఖమ్మం నగరం 3టౌన్ అధ్యక్షుడు కొణతం లక్ష్మీనారాయణ అధ్యక్షతన రత్న గార్డెన్స్ లో జరిగిన “సంఘటన పర్వ్ – సదస్యతా అభియాన్” సమావేశం లో ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి శ్రీ మారుతి వీరభద్ర ప్రసాద్ పాల్గొని మాట్లాడారు . 1980 ఏప్రిల్ 6న స్థాపించిన భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ , శాఖలుగా విస్తరిస్తూ ప్రధానమంత్రి బీమా యోజన , ప్రధానమంత్రి సురక్ష యోజన , ప్రధానమంత్రి సుకన్యా యోజన , అటల్ పెన్షన్ యోజన పథకాలను ప్రజలకు పరిచయం చేసిందని అన్నారు . అలాగే 370 ఆర్టికల్ రద్దుచేసి కాశ్మీరును భారతదేశంలో విలీనం చేసిందని , త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి మైనార్టీ సోదరీమణుల హక్కులను రక్షించిందని , అంత్యోదయ పథకం ద్వారా పేదలకు కడుపు నిండటానికి ప్రతి మనిషికి ఐదు కేజీల సన్న బియ్యం ఇస్తుందని కుటుంబ పాలనకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని , దేశ రక్షణకు జాతీయ సమైక్యతకు భారతీయ జనతా పార్టీ ఆశాకిరణమని కొనియాడటం జరిగినది . ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు చావా కిరణ్ , శాసనాల సాయిరాం , ఈదుల వీరభద్రం , జంగిలి రమణ , డోన్వన్ దాసు , రాహుల్ , గోనెల శివ , శీలం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »